బైక్‌ను ఢీకొన్న బస్సు: విద్యార్థి దుర్మరణం

సాక్షి, హైదరాబాద్‌: విద్యానగర్లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. విద్యార్థి ప్రయాణిస్తున్న బైక్‌ను స్థానిక వివేకానంద డిగ్రీ కాలేజీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సెయింట్‌ మేరిస్‌ కళాశాలకు చెందిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి రోణి సిరిల్‌(17) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రాంనగర్‌ నివాసిగా తెలుస్తోంది. 

Back to Top