అత్తారింటి ఎదుట కోడలి శవంతో ధర్నా | Srilatha Commits Suicide on Extra Dowry Harassments | Sakshi
Sakshi News home page

అత్తారింటి ఎదుట కోడలి శవంతో ధర్నా

May 8 2019 7:10 AM | Updated on May 8 2019 12:17 PM

Srilatha Commits Suicide on Extra Dowry Harassments - Sakshi

శ్రీలత అత్తగారింటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగిన బంధువులు ,శ్రీలత (ఫైల్‌)

భర్త, అత్తమామల అదనపు కట్నం వేదింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) ముంబాయిలోని తన మేనమామ వెంగళ్‌రావు ఇంట్లో  సోమవారం ఆత్మహత్య చేసుకుంది.

రామంతాపూర్‌: భర్త, అత్తమామల అదనపు కట్నం వేదింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) ముంబాయిలోని తన మేనమామ వెంగళ్‌రావు ఇంట్లో  సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి  రామంతాపూర్‌లోని అత్తాగారింటికి శ్రీలత మృతదేహాన్ని బంధువులు  తీసుకొచ్చారు.విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు వారి ఇంటి ఎదుట శ్రీలత మృతదేహాన్ని ఉంచి ఆందోళన కు దిగారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2011లో జువ్వాడి వంశీరావుతో శ్రీలతకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆడపిల్ల పుట్టిందని అత్తామామలు, భర్త వేధింపులు ఎక్కువవయ్యారు. ఈ క్రమంలోనే  కూతురిని పెడుతున్న వేధింపులు భరించలేక శ్రీలత తల్లిదండ్రులు పీసర శ్రీనివాస్‌రావు, చంద్రకళ మనోవేదనతో మృతి చెందారని బందువులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement