భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య | Software Employee Suicide In Miyapur | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Sep 24 2019 6:13 PM | Updated on Sep 24 2019 7:52 PM

Software Employee Suicide In Miyapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మదీనగూడా సమీపంలో గల ల్యాండ్మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే మహితి (28).. తాను నివసిస్తోన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహితి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Advertisement
 
Advertisement
Advertisement