వీడని అస్థిపంజరం మిస్టరీ

Skeleton Found In Bellampalli Still A Mystery - Sakshi

బెల్లంపల్లిలో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా వెలుగుచూసిన వైనం

సాక్షి, బెల్లంపల్లి: పట్టణంలోని కాంటా చౌరస్తా ప్రాంతం సింగరేణి పాత సివిల్‌ విభాగానికి చెందిన శిథిలమైన భవనంలో కనిపించిన అస్థిపంజరం మిస్టరీ ఇంకా వీడలేదు. మూడు రోజుల క్రితం వెలుగుచూసిన ఈ అస్థిపంజరం ఎవరిదన్నది తెలియరావడం లేదు. గుర్తు పట్టడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉండడంతో సస్పెన్షన్‌ వీడడం లేదు. ఈ ఘటనను పోలీసు వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరా మహిళా, ఏ ప్రాం తానికి చెందినది, ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు, ఒంటరిగా వచ్చిందా లేదా ఎవరితోనైనా వచ్చిందా, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఆత్మహత్య చేసుకుందా, కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఆనవాళ్లు..
ఘటనా స్థలిలో లభ్యమైన మృతురాలి మోకాలు, కాలి వేలికి ధరించిన మట్టెలు, ఎముకలు, ఇతర పదార్థాలు, ఆ ప్రాంతంలో దొరికిన మరికొన్ని వస్తువులను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యా బ్‌కు పంపారు. మరోవైపు క్లూస్‌ టీమ్‌ ద్వారా వీలైనంత వరకు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆగిన ప్రాంత పరిసరా లను కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. ము ఖ్యం గా పాత సివిల్‌ విభాగం భవనాల వైపు ఇన్నాళ్లుగా ఎవరెవరూ వచ్చారు, ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎందుకోసం ఆ ప్రాం తానికి రాకపోకలు సాగించారు, ఆప్రాంతాన్నే ఎందుకోసం ఎంచుకుని ఉంటారు, ఎన్నిరోజు లుగా తచ్చాడారు ఆ ప్రాంతంలో, ఎంతమంది సంచరించారు, ఏ సమయంలో వచ్చివెళ్లిపోయే వారో తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.  

రోడ్డుకు కూతవేటు దూరంలో..
శిథిలమైన భవనం మధ్య ఉన్న చెట్ల పొదల్లో అస్థిపంజరం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ ప్రాంతం బజారు ఏరి యా ప్రధాన రహదారిని ఆనుకుని కేవలం 20 మీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో రేయిం బవళ్లు జనసంచారం ఉంటుంది. ఓ వైపు మసీ దు, ముందు ప్రధాన రహదారి, వెనక వైపు పద్మశాలి భవనం, మరోవైపు బాబుక్యాంపు బస్తీకి వెళ్లే అంతర్గత రహదారి ఉంది. మృతురాలు ఆ శిథిలమైన భవనంలోకి ఎందుకు వెళ్లి ఉంటుందో అంతుచిక్కడం లేదు. చెట్ల పొదల్లో చనిపోయి అస్థిపంజరంగా మారే వరకు ఎవరూ గుర్తించలేక పోయారు. రోడ్డు పక్కన మెకానిక్‌ వర్క్స్‌ నిర్వహిస్తున్న సయ్యద్‌ అనే వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి దుర్వాసన రావడంతో అటువైపు వెళ్లడంతో అస్థిపంజరం వెలుగు చూడడం సంచలనమైంది. 

గుర్తింపే అత్యంత కీలకం..
మిస్టరీగా మారిన మహిళ అస్థిపంజరం ఘట నను చేధించడం పోలీసులకు సవాల్‌గా మారిం ది. ఇటీవలి కాలంలో అదృశ్యమైన మహిళలు ఎంత మందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏడేళ్ల్ల క్రితం బెల్లంపల్లి టేకుల బస్తీలో జనావాసాలను ఆనుకుని గోనే సంచిలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపో యి బయట పడింది. ఇప్పటికీ ఆ మృతదేహం మిస్టరీగానే మారింది. అదే తరహాలో తాజాగా మహిళ అస్థిపంజరం వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top