స్పా ముసుగులో వ్యభిచారం..

Prostitution Center Running In The Name Of SPA At Nellore - Sakshi

పక్కా సమాచారంతో దాడులు

ఐదుగురి అరెస్ట్‌

సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని మాగుంట లేఔట్‌లో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టును సోమవారం పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన బి.ధనంజయరెడ్డి కొన్నేళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చాడు. మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటూ ఆర్థిక వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఆరునెలల క్రితం అతను అదే ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న స్టూడియో 11 సెలూన్‌ అండ్‌ స్పాను నెలకు రూ.70 వేలు చెల్లించేలా లీజ్‌కు తీసుకున్నాడు. స్పాను అధునాతన హంగులతో తీర్చిదిద్దాడు. వివిధ ప్రాంతాల్లో నుంచి యువతులను తీసుకువచ్చి వారిచే కస్టమర్లకు మసాజ్‌ చేయించడం ఆపై వారిచే వ్యభిచారం చేయించడం పరిపాటిగా మారింది. దీంతో పెద్దసంఖ్యలో కస్టమర్లు రావడం మొదలైంది. లావాదేవీలు మొత్తం ఫోన్‌లో జరిగేవి. ఈ విషయాలను బయటకు పొక్కకుండా నిర్వాహకుడు జాగ్రత్తపడ్డాడు.

డీఎస్పీ ఆధ్వర్యంలో నిఘా
స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి అందింది. ఆయన ఆదేశాల మేరకు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో చిన్నబజారు, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌లు ఐ.శ్రీనివాసన్, మిద్దె నాగేశ్వరమ్మలు సెంటర్‌పై నిఘా ఉంచారు. సోమవారం వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు తమ సిబ్బందితో కలిసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. నిర్వాహకుడితోపాటు ఇద్దరు సెక్స్‌వర్కర్లు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి ఫోన్‌ను పరిశీలించిన అధికారులు నిర్ఘాంతపోయారు. అందులో యువతుల అశ్లీల చిత్రాలు, కస్టమర్ల ఫోన్‌ నంబర్లు తదితరాలను గుర్తించారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి చేసు నమోదు చేశారు. సెక్స్‌వర్కర్లను హోమ్‌కు తరలించి ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నబజారు, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్సైలు చిన్ని బలరామయ్య, బి.నాగభూషణం, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.

అవాక్కైన స్థానికులు
మెట్రో నగరాలకే పరిమితమైన వెరైటీ మసాజ్‌లు, క్రాస్‌ మసాజ్‌లు జిల్లాకు పాకాయి. అనేక స్పా సెంటర్‌లు కస్టమర్లను ఆకర్షిస్తూ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నారు. నగరంలో దాడి చేసిన స్పా సెంటర్‌ ఉన్న బిల్డింగ్‌లో వివిధ వ్యాపార సంస్థలున్నాయి. పోలీసులు దాడిచేసి వ్యభిచార గుట్టు రట్టు చేసేవరకు వ్యభిచారం జరుగుతోందన్న విషయం అక్కడి వారికి తెలియదు. దీనిని బట్టి చూస్తే నిర్వాహకుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించడో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కసారిగా పోలీసులు దాడిచేసి నిర్వాహకుడితోపాటు సెక్స్‌వర్కర్లు, విటులను బిల్డింగ్‌పై నుంచి కిందకు తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. నగరంలో వివిధ చోట్ల ఇలాంటి సెంటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top