జంట హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు

Police Arrested Criminal For Elderly Couple Murder In hasanparthy - Sakshi

సాక్షి, హసన్‌పర్తి : పట్టణంలో కలకలం రేపిన వృద్ద దంపతుల హత్య మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడి బుధవారం హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన గడ్డం దామోదర్‌(58), పద్మ(49) దంపతులు సోమవారం రాత్రి గుర్తు దారుణ హత్య గురయ్యారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హసన్‌పర్తికి చెందిన కిరాణ దుకాణం యజమాని కామారపు ప్రశాంత్‌(32)గా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.4,75,863 విలువ చేసే బంగారాన్ని, 356.240 గ్రాములు వెండి అభరణాలు, ఒక కత్తి, సెల్‌ఫోన్‌తో పాటు 6,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దామోదర్‌ పొరుగింట్లోనే ఉంటున్న ప్రశాంత్‌ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top