సిటీబస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు | People Injured In Bus Accident Krishna | Sakshi
Sakshi News home page

సిటీబస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు

Nov 10 2018 12:43 PM | Updated on Nov 10 2018 12:43 PM

People Injured In Bus Accident Krishna - Sakshi

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన బస్సు

కృష్ణాజిల్లా, సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్‌): బందరురోడ్డులో సిటీ బస్సు ఢీకొని   ముగ్గురికి గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం..  పటమట కరణంవారి వీధికి చెందిన ఎస్‌.కె.గౌస్‌ ఆహ్మద్‌ పంట కాలువరోడ్డులోని ఒక హోటల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు అబ్దుల్‌ రహీం (12),అబ్దుల్‌ రేహాన్‌ (10) ఇద్దరు కుమారులు. వీరు ఒన్‌టౌన్‌లోని స్కూల్లో చదువుతున్నారు. ప్రతిరోజు ఆటోలో స్కూల్‌కు  వెళ్లి వచ్చే వీరికి ఉదయం ఆటో రాకపోవడంతో స్కూల్లో దింపి రమ్మని మేనల్లుడు ఎస్‌కె.నిసార్‌బాబు చెప్పాడు.

తన ద్విచక్రవాహనంపై ఇద్దరిని తీసుకుని వస్తుండగా ఉయ్యూరుకు డిపోకు చెందిన సిటీ బస్సు బెంజిసర్కిల్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వైపు వెళ్తూ ఆర్టీఏ బస్టాప్‌  వద్ద స్పీడుగా ఎడమ వైపుగా రావడంతో ద్విచక్ర వాహనం హ్యాండిల్‌కు బస్సు తగిలి ముగ్గురూ కిందపడ్డారు.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు.. అబ్దుల్‌ రేహాన్‌ కుడిభుజానికి తీవ్ర గాయ మై పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సూర్యారావు పేటలోని ఆంధ్రా హాస్పటల్‌ కు తరలించారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. నిసార్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement