పెద్దబొంకూర్‌ వీఆర్‌ఏ సస్పెన్షన్‌

Peddabonkur VRA Suspended - Sakshi

అక్రమంగా మూడెకరాల 12గుంటల భూమి కబ్జా

రైతుబంధు రికవరీకి చర్యలు

ఎంపీటీసీ ఫిర్యాదుతో పట్టాలు రద్దు చేసిన అధికారులు

సాక్షి, పెద్దపల్లి: భూమిలేని నిరుపేదలకు పం చాల్సింది పోయి వీఆర్‌ఏగా పనిచేస్తున్న వ్యక్తే తన పేరిట ప్రభుత్వభూములను అక్రమ పద్ధతుల్లో పట్టా చేసుకున్న సంఘటన పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ ఎంపీటీసీ మిట్టపల్లి వసంత సమాచారహక్కు చట్టం ప్రకారం సద రు భూములకు సంబంధించిన వివరాలు కోరడంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీలేక సదరు వీఆర్‌ఏ పేరిట ఉన్న పట్టాదారు పాసుబు క్కులను రద్దు చేశారు.

వివరాల్లోకి వెళితే.. పెద్దబొంకూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 325/16/1లో ఎకరం, సర్వేనంబర్‌ 485/20/1లో 20గుంటలు, 590లో 19 గుం టలు, 592లో 12గుంటలు, 620లో 16గుంట లు, 622లో 11గుంటలు, 649లో 14గుంటల భూమిని అక్రమంగా తనపేరిట రాయించుకు ని పాసుబుక్కు నంబర్‌ టీ20100190237 పొందినట్టు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు పట్టాదార్‌ పాసుపుస్తకాలను రద్దు పర్చినట్లు  ప్రకటించారు. వీఆర్‌ఏ రాయమల్లును సస్పెం డ్‌ చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ రాజనరేందర్‌గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న రైతుబంధు పథకం కింద పొందిన పె ట్టుబడి సాయాన్ని కూడ రికవరీ చేసేలా సం బంధిత అధికారులకు సూచించామని పేర్కొన్నారు. కాగా పెద్దబొంకూర్‌లో రెవెన్యూ సం బంధమైన అవకతవకలు అనేకంగా జరిగా యని, ఈ విషయమై జిల్లాకు సంబంధంలేని అధికారులతో బహిరంగ విచారణ జరిపితే అ నేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎంపీటీసీ వసంత కోరారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ భూములను భూముల్లేని పేదలకు పంచాలని ఆమె కోరారు. 

సుల్తాన్‌పూర్‌ పంచాయతీ కార్యదర్శి..
పెద్దపల్లిఅర్బన్‌: విధులల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తు కలెక్టర్‌ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి డి.సంపత్‌ కృష్ణారెడ్డి విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీపీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం సంపత్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top