తల్లిదండ్రులు కాదు.. సైకోలు

Parents Deny Torturing To 10 Children In California - Sakshi

కాలిఫోర్నియా : ప్రేమగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు క్రూరత్వానికి ప్రతిరూపంగా మారారు. తమ పది మంది పిల్లలను తీవ్రంగా హింసించారు. ప్రతి రోజూ వారికి పత్యక్ష నరకాన్ని చూపించారు. ఎట్టకేలకు వారి పాపం పండింది. పొరుగుంటి వారిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పది మంది పిల్లల​కు అక్కడి నుంచి విముక్తి కలిగించారు. ఆ తల్లిదండ్రులిద్దర్ని అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జొనాధన్‌ అల్లెన్‌, ఇనా రోజర్స్‌ భార్యాభర్తలు వీరికి పదిమంది పిల్లలు.

ఏమైందో తెలియదు గత కొద్ది నెలలుగా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పిల్లలను ఏ తప్పు చేయకపోయినా కొట్టడం, కాల్చడం, గాయపర్చడం చేసేవారు. ఒక రోజు రాత్రి పెద్ద కుమారున్ని తీవ్రంగా కొట్టడంతో అతడు ఇంటి నుంచి పారిపోయి పక్కింటి గార్డెన్‌లో నిద్రపోయాడు. అదే సమయంలో అటుగా రౌండ్సుకు వెళుతున్న పోలీసులు అతన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటి పరిస్థితి, అల్లెన్‌, రోజర్స్‌ మాటలపై అనుమానం రావడంతో ఇంటి లోపల సోదాలు నిర్వహించారు.

ఇంటి లోపలికి వెళ్లిన వాళ్లకు ఆ పిల్లాడి తల్లిదండ్రులు సైకోలని అర్థమయ్యింది. ఇల్లు బయటకు మాత్రం అందంగా కనిపించినా లోపల మొత్తం చెత్త చెదారంతో, మనుషుల, జంతువుల మల మూత్రాలతో నిండి పోయింది. బాత్‌ రూమ్‌ గోడల నిండా పక్షుల వ్యర్థాలతో నిండి ఉండటం పోలీసులు గమనించారు. పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు చేస్తున్న అకృత్యాలను పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు పిల్లలను అక్కడి నుంచి సంరక్షణా కేంద్రానికి తరలించి ఆ దంపతులిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top