ఆన్‌లైన్‌ మోసానికి చిక్కిన యువకుడు

Online Fraud in Srikakulam - Sakshi

శ్రీకాకుళం, సారవకోట: మండలంలోని చిన్నగుజువాడ గ్రామానికి చెందిన తంప తులసీరావు ఆన్‌లైన్‌ మోసంలో చిక్కి రూ.3255 నష్టపోయాడు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఒక హెర్బల్‌ కంపెనీకు సంబంధించిన ప్రకటను టీవీలో చూసి ఆయుర్వేద మందుల కోసం 8 నెలల క్రితం రూ.3100 పోస్టల్‌ పంపించగా తొలి విడతలో మందులు పంపించారు. మళ్లీ 6 నెలల తర్వాత రూ.3500 చెల్లించి మందులు పంపించాలని కోరగా కావల్సిన మందులు కాకుండా వేరే మందులు పంపించారు.

దీనిపై సంబంధిత కంపెనీ ప్రతినిధితో మాట్లాడితే తిరిగి సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చి ఫోన్‌కు అందుబాటులో లేకుండా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 20న మరలా అదే కంపెనీ నుంచి తులసీరావుకు ఫోన్‌ చేసి కంపెనీ లక్కీ డ్రాలో మీరు రూ.40 వేలు చెక్కు, ఒక మొబైల్‌ ఫోన్‌ పొందారని దీనికి సంబంధించిన పార్సిల్‌ను పోస్టల్‌లో డబ్బులు చెల్లించి తీసుకోవాలని సూచించారు. దీంతో సారవకోట పోస్టాఫీసుకు వచ్చిన పార్సిల్‌ను రూ.3255 చెల్లించి గురువారం తీసుకోగా దాంట్లో మట్టిపొడి ప్యాకెట్‌ మాత్రమే ఉండటంతో బాధితుడు తులసీరావు లబోదిబోమంటున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top