విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

One Died In Vizag Steel Plant - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఓ ఉద్యోగి మృతి చెందాడు. రైల్వే సైడింగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిక్‌లైన్‌లో గూడ్స్‌లో షంటింగ్‌ చేస్తూ ఉండగా మరో గూడ్స్‌ ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటనతో అక్కడి డ్రైవర్లు పరారయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top