నేరాలకు ‘కంట్రోల్‌’ ఏదీ..! | Sakshi
Sakshi News home page

నేరాలకు ‘కంట్రోల్‌’ ఏదీ..!

Published Mon, Mar 19 2018 7:12 AM

No 'control' for crimes .. - Sakshi

కడప అర్బన్‌ : జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సక్సెస్‌గా నడిపించేందుకు ‘పోలీస్‌ బాస్‌’ తమ వంతుగా కృషి చేస్తున్నారు. కడప నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ను గత ఏడాదిలో ప్రారంభిం చారు. తాజాగా ప్రొద్దుటూరు పట్టణంలోను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంట ర్‌ను రెండవ కేంద్రంగా ప్రారంభించారు. 
- కడప నగరంలో ప్రారంభించిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కూడా సత్ఫలితాలనిస్తోంది. 
- వేలాదిమంది ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారని, నేరాలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
- నేరాల నియంత్రణ బాగున్నా క్షేత్ర స్థాయిలో కొందరు పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది.  
- ఇటీవల కాలంలో కొందరు తమ ద్విచక్రవాహనాలను పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సందర్భాల్లో ఫిర్యాదు ఎక్కడ చేశారని ఎదురు ప్రశ్నించడం, తాము ఫిర్యాదు చేసిన సందర్భాలలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఇవ్వాలనీ కోరితే... దొరికినప్పుడు ఎలాగు రికవరి చేస్తామని మాట దాటేయడం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
- కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో గత నెలలో పట్టపగలు గంగాదేవి అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు చైన్‌ను, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి లాక్కెళ్లారు. 
- ఇటీవల నగరంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘చెడ్డీగ్యాంగ్‌’ చోరీకి యత్నిం చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీ లకు పాల్పడే లోపే వారిని నిరోధించాల్సిన పోలీసులు ఆ గ్యాంగ్‌ జాడ ఇక్కడలేదని సరిపెట్టుకుంటున్నట్లు సమాచారం. 
- పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా పాత నేరస్తురాలు ‘షబానా ఆజ్మి’ ఓ మహిళ నుంచి పర్సును దొంగలించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఆమె అంతకు ముందు కొన్ని నెలల క్రితమే పలు నేరాలకు పాల్పడి కటకటాల పాలైంది. ఆమె విడుదలయ్యాక ‘పరివర్తన’ లాంటి కార్యక్రమం ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించి పునరావాసం కల్పిస్తే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

కొందరు పోలీసుల అత్యుత్సాహం

- కడప నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నుంచి ఉత్సాహవంతులైన పోలీసు సిబ్బంది, అధికారులను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విధుల కోసం తీసుకున్నారు. 
- సంక్రాంతి పండుగ సమయంలో పక్కీర్‌పల్లె చెరువు వద్ద గోళీలాట ఆడుకుంటున్న సమయంలో యువకుల గుంపుపై బ్లూకోల్ట్స్‌ వారు దాడికి ఉపక్రమించారు. ఆ సమయంలో వీరయ్య అలియాస్‌ వీరు మృతిచెందాడు. ఆ సమయంలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా తెలిసినప్పటికీ తన భర్త ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడ్డాడని మృతుని భార్య వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
- రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు, కారు లాంటి వాహనదారులపై అనుమానం పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారుల్లో కొందరు కడప నగరంలోని స్థానిక పోలీసు అధికారుల ప్రమేయం కోసం ఎదురు చూడకుండా తమకు సమాచారం వచ్చిన వెంటనే తమంతట తాముగా నేర నియంత్రణకు ప్రయత్నిస్తూ ‘తప్పు’లో కాలేస్తున్నట్లు తెలుస్తోంది. 
- కడప నగరంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ‘వ్యభి చార గృహం’పై దాడి చేసిన ఓ ఎస్‌ఐ వారిలో ‘యువతి’ ని హోంకు పంపి, మరో ఇద్దరి విషయంలో చేతి వాటం ప్రదర్శించి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
- ఏది ఏమైనా నేరాల నియంత్రణ విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement