వీడియో గేమ్‌ కోసం అక్కను కాల్చిచంపిన తమ్ముడు | Nine year old Shoots Sister After She Refused to Give Video Game Controller | Sakshi
Sakshi News home page

వీడియో గేమ్‌ కోసం అక్కను కాల్చిచంపిన తమ్ముడు

Mar 20 2018 12:58 PM | Updated on Apr 4 2019 3:25 PM

Nine year old Shoots Sister After She Refused to Give Video Game Controller - Sakshi

మిస్సిసీపీ : అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. పదమూడే​ళ్ల బాలిక సొంత తమ్ముడి చేతిలోనే హత్యకు గురైంది. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రంలో గత శనివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో గేమ్‌ కంట్రోలర్‌ కోసం జరిగిన వాదనే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నివేదికల్ని పరిశీలించిన అనంతరం రిమోట్‌ కంట్రోల్‌ ఇవ్వడానికి బాలిక నిరాకరించడంతోనే బాలుడు ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. బాలుడు వెనుక నుంచి తుఫాకీతో కాల్చడంతో బుల్లెట్‌ ఒక్కసారిగా బాలిక మెదడులోకి దూసుకెళ్లింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న టెన్నెసీలోని మెంఫిస్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. అసలు ఆ బాలుడికి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement