హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్

Nigerians And One Indian Lady Arrested In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రస్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లతో పాటు ఓ ముంబై మహిళను అరెస్ట్ చేసినట్లు సమాచారం.  పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీలో కొకైన్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు... సైబరాదాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. తమ తనిఖీల్లో ఇద్దరు నైజీరియా వ్యక్తులను, ఓ ముంబై మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొకైన్ విలువ 4 లక్షల రూపాయలు ఉంటుంది. 

సైజీరియాకు చెందిన ఎమ్మాన్యుల్ ఉముడు (43) ఏ1, ఇదుష్ ప్లస్ (45) ఏ2 లు బిజినెస్ వీసా మీద కొన్నేళ్ల కిందట భారత్‌కు వచ్చి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మాన్యుల్-ఏ1, లీలా శివకుమార్ (37) ఏ3 ని వివాహం చేసుకున్నాడు. వీరు గ్రాముకు రూ.4000 నుంచి రూ.5000 ధరకు కొకైన్‌ను విక్రయించేవారు. గతేడాది డిసెంబర్‌లో తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కు వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఎమ్మాన్యుల్-లీలా శివకుమార్‌లు నగరానికి మకాం మార్చారు. తమకు అందిన సమాచారంతో పుప్పలగూడలోని ఫ్రెండ్స్ కాలనీ, సాయి బాలాజీ రెసిడెన్సీలో ఆకస్మిక దాడులు చేపట్టిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top