2 దశాబ్దాలు.. 40 హత్యలు

Munna Bajrangi Life Story - Sakshi

లక్నో : గ్యాంగ్‌స్టర్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా భజ్‌రంగీ సోమవారం ఉదయం భాగ్‌పత్‌ జైల్లో హత్యకు గురయ్యాడు. 2009లో బీజేపీ ఎమ్మేల్యే క్రిష్ణానంద్‌ రాయ్‌ని కృరంగా హత్య చేసిన నేరానికి గాను శిక్ష అనుభవిస్తున్న మున్నాను అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్‌ తుపాకితో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. 1967లో ఉత్తరప్రదేశ్‌ పూర్వాంచల్‌ ప్రాంతంలో జన్మించిన మున్నా జీవితం భిక్షాటనతో మొదలై అనతి కాలంలోనే గ్యాంగ్‌స్టర్‌గా, రాజకీయ నాయకుడిగా ఎదిగాడు.   

17 ఏటే తొలి కేసు...
కేవలం ఐదో తరగతి వరకే చదివిన మున్నా చాలా చిన్న వయసులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. చిన్నతనం నుంచే మరాణాయుధాలు కలిగి ఉండేవాడు. తన 17 ఏట అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే నేరం కింద తొలిసారి అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జౌన్‌పూర్‌లోని గజరాజ్‌ సింగ్‌ గ్యాంగ్‌లో చేరాడు. 1984లో తొలిసారి  బీజేపీ ఎమ్మేల్యే రామ్‌చంద్ర సింగ్‌ను హత్య చేశాడు.

ముక్తర్‌ అన్సారి కుడి భుజం...
తరువాత కాలంలో మున్నా మౌ ప్రాంతంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ ముక్తర్‌ అన్సారి గ్యాంగ్‌లో చేరి, అనతి కాలంలోనే అన్సారి కుడిభుజంగా ఎదిగాడు. తొలుత గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న ముక్తర్‌ అన్సారి అనంతర కాలంలో రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. 1996లో అన్సారి రాజకీయాల్లో చేరి సమాజ్‌వాద్‌ పార్టీ తరపున మౌ ప్రాంత ఎమ్మేల్యేగా ఎన్నికైనాడు. అన్సారి రాజకీయ నాయకుడిగా ఎన్నికైన తర్వాత మున్నా గ్యాంగ్‌ కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. గవర్నమెంట్‌ కాంట్రక్టర్‌లను బెదిరించి డబ్బు వసూలు చేయడం ప్రారంభించారు.

బీజేపీ ఎమ్మేల్యే హత్య...
ఇన్ని రోజులు యూపీకి మాత్రమే పరిమితమైన మున్నా.. తొలిసారి  2005లో బీజేపీ ఎమ్మేల్యే క్రిష్ణానంద్‌రాయ్‌ హత్యతో దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాడు. క్రిష్ణానంద్‌ రాయ్‌, బ్రిజేష్‌ సింగ్‌ గ్యాంగ్‌తో కలిసి అన్సారీ గ్యాంగ్‌ చేసే పనులకు అంతరాయం కల్గిస్తుండేవాడు. దాంతో 2005లో మున్నా క్రిష్ణానంద్‌ రాయ్‌ మీద దాడి చేసి కృరంగా హత్య చేశాడు. భజ్‌రంగీ గ్యాంగ్‌ సభ్యులు దాదాపు ఆరు ఏకే - 47 రైఫిల్స్‌తో ఎమ్మేల్యేపై బెల్లేట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాయ్‌ శరీరంలోకి దాదాపు 400 బుల్లెట్లు దూసుకుపోయాయి. రాయ్‌ హత్య అనంతరం 2009లో మున్నాను పోలీసులు ముంబైలోని మలద్‌ ప్రాంతంలో అరెస్టు చేశారు.

రాజకీయ నాయకుడిగా...
గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన మున్నా.. అనంతరం తన గురువు ముక్తర్‌ అన్సారి బాటలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తీహార్‌ జైల్లో ఖైదిగా ఉన్న సమయంలోనే 2012 యూపీ ఎన్నికల్లో అప్నాదళ్‌ పార్టీ తరపున పోటి చేసి ఓడిపోయాడు. ఈ రెండు దశాబ్దాల కాలంలో మున్నాపై దాదపు 40 హత్య కేసులతోపాటు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top