పీలేరులో తల్లీబిడ్డ అదృశ్యం

Mother And Daughter Missing in Piler Chittoor - Sakshi

పీలేరు: బిడ్డతో సహా తల్లి అదృశ్యమైన ఘటన పీలేరులో సోమవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు యల్లమంద క్రాస్‌కు చెందిన గురునాథ్, శివరాణి దంపతులకు రుషికేశ్వర్‌(2) కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారికి ఆరోగ్యం సరిగా లేదని శివరాణి శనివారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లింది. 10 గంటలవుతున్నా ఇంటికి రాకపోవడంతో గురునాథ్‌ భార్యకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో విచారించాడు. ఫలితం లేకపోవడంతో సోమవారం పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top