వారాసిగూడలో బాలిక దారుణ హత్య

సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. కాగా బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రెండు అపార్ట్‌మెంట్ల మధ్య పడిఉన్న బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి,పోస్ట్‌మార్టం చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా బాలిక నిన్న సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
ఉద్రిక్తంగా వారాసిగూడ ప్రాంతం
కాగా ఈ సంఘటనతో వారాసిగూడ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలి ఇంటి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు మృతురాలి బంధువులు..బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వారాసిగూడలో భారీగా మోహరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి