వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం | Missing Cases In Kovvur West Godavari | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

Jul 26 2019 11:28 AM | Updated on Jul 26 2019 11:28 AM

Missing Cases In Kovvur West Godavari - Sakshi

కీర్తి, గంగాధర్‌, త్రినాథ్‌ (ఫైల్‌ ఫొటోలు) 

సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): పట్టణంలో నివాసం ఉంటున్న కాగిత త్రినాథ్‌ అనే వ్యక్తి గడిచిన పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.  కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.కేశవరావు తెలిపారు. విజ్జేశ్వరం జీటీపీఎస్‌ ప్లాంటు ఫైర్‌ డిపార్టుమెంట్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న త్రినాథ్‌ పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. త్రినాథ్‌ ఆచూకీ తెలిసిన వాళ్లు పట్టణ పోలీసు స్టేషన్‌ 08813–231100 నెంబర్‌కి ఫోన్‌ చేయాలని ఎస్సై కోరారు.

చాగల్లు గ్రామంలో.. 
చాగల్లు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్‌ తెలిపారు. చాగల్లు గ్రామానికి చెందిన సుంకవల్లి గంగాధర్‌(43) మతి స్తిమితం లేని వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్ల వద్ద వెతికినా సమాచారం తెలియకపోవడంతో తల్లి సుంకవల్లి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్‌ తెలిపారు.

వివాహిత అదృశ్యం
చాగల్లు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్‌ తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన బోల్లా కీర్తి అనే 23 సంవత్సరాల వివాహిత ఈ నెల 24వ తేదీన నిడదవోలులో ఆస్పత్రికి వెళ్తానని భర్త నాగసూర్యచంద్రంకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement