16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Minor Girl Molestation By Three Men For 51 Days In Noida - Sakshi

నొయిడా : దాదాపు సైకోటిక్‌ సినిమా కథను తలపించేలాంటి సంఘటన ఇది. ఓ పదహారేళ్ల బాలికకు ఎదురైన చేదు అనుభవం. బాలిక జీవితకాలం మర్చిపోలేని దుర్ఘటన. ఒకటి కాదు రెండు ఏకంగా 51 రోజులు ఆ బాలిక బతికుండగానే నరకాన్ని చవి చూసింది. పక్కింటివాళ్లని నమ్మినందుకు...ఆమెను కిడ్నాప్‌ చేసి 51 రోజుల పాటు నరకం చూపించారు. బాలిక అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాలో చోటు చేసుకుంది. చివరకు ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. 

ఎలా జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి నోయిడా సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాలికకు చదువు రాదు. ఇంటి వద్దే ఉంటూ చిన్న చితక పనులు చేస్తుండేది. రెండు నెలల క్రితం వారి ఇంటికి సమీపంలో మధ్యప్రదేశ్‌కు చెందిన చోటు, యూపీకి చెందిన సురాజ్‌లు అద్దెకు వచ్చారు. మొదట బాలికతో స్నేహం ఏర్పరచుకున్న దుండగులు వారం రోజుల తర్వాత ఆమెను కిడ్నాప్‌ చేసి ఓ గదిలో బంధించారు.

అక్కడ ఆదిత్య అనే మరో వ్యక్తితో కలిసి 51 రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఏప్రిల్‌ 22న బాలిక ఆ గది నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న ఆ ముగ్గురు దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top