
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్ల ధర్మారావు
నడి రోడ్డులో ఇద్దరు వ్యక్తుల కొట్లాట
విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని పెదమేరంగి కూడలిలో ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాల మీదకు వచ్చింది. పెదమేరంగి కూడలిలో దుస్తుల వ్యాపారం చేస్తున్న పల్ల ధర్మారావును అదే కూడలిలో కిరాణా వ్యాపారం చేస్తున్న బంటు లోకనాథం బుధవారం ఉదయం గొడవపడ్డారు. ఈ సంఘటనలో లోకనాథం రాడ్డుతో ధర్మారావు తలపై బాదాడు. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట సీఐ డీవీజే రమేష్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడికి ఉపయోగించిన కత్తి, రాడ్డుతో పాటు పడిపోయిన మర్మాంగాన్ని పోలీసులు భద్రపరిచారు. ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఘర్షణ పడ్డారో తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. సీఐ సూచనల మేరకు ఎస్సై బి. శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.