వివాహిత బలవన్మరణం | married woman commit to suicide | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Feb 8 2018 11:02 AM | Updated on Nov 6 2018 7:53 PM

married woman commit to suicide - Sakshi

భర్త ప్రవీణ్‌తో పుష్పలత(ఫైల్‌)

కర్నూలు, మహానంది:   ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం పొందింది. ఈక్రమంలో తన రెండేళ్ల కుమార్తెను సైతం పట్టుకుంది. గమనించిన చిన్నారి తాత ఆమెను కాపాడాడు.  వివరాల్లోకి వెళితే....మహానంది దేవస్థానం కాలనీకి చెందిన బండి ప్రవీణ్‌కు గద్వాల సమీపంలోని శేక్‌పల్లి(ఎర్రవల్లి చౌరస్తా)కి చెందిన పుష్పలత(25)తో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తె విద్య ఉంది. ఇటీవల వీరు వేరు కాపురం పెట్టారు. ప్రవీణ్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గర్భంతో ఉన్న పుష్పలత బుధవారం ఉదయం కుమార్తెతో కలిసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.  పాప ఏడవడం, పొగలు రావడం గమనించిన వీరభద్రుడు( చిన్నారి తాత) వెంటనే స్పందించి ఇంట్లోకి వెళ్లి చిన్నారిని బయటికి తీసుకొచ్చాడు. పుష్పలత మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తన కుమార్తె ఆత్మహత్యకు అల్లుడి వేధింపులే కారణమని ఆమె తండ్రి బీసీ రెడ్డి ఆరోపించారు. మృతురాలి తండ్రి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement