సాక్షి, ఖమ్మం: మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈనెల 8న కిడ్నాప్‌కు గురైన టీఆర్‌ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును దారుణంగా హత్య చేశారు. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం గుర్తించారు. అతని మృతదేహం పక్కనే శబరి ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి శారద పేరుతో ఓ లేఖను వదిలివెళ్లారు. ఆయన కొత్తగూడెం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతగా తెలుస్తోంది.
‘నల్లారి శ్రీనివాసరావును పోలీసులుకు ఇన్ఫార్మర్ అయినందుకు ఖతం చేశాం. ఇంటెలిజెన్సీ, పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫ్మార్మర్లను తయారు చేస్తున్నాడు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పోలీసులకు చేరవేస్తున్నాడు. అలాగే ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయిస్తున్నాడు. అదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల అండతో అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయిస్తున్నాడు. ఎస్‌ఐబీతో కలిసి ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో సీపీఐ మావోయిస్ట్ పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నాడు. అదివాసీ వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నలవడంతో శ్రీనివాసరావును ఖతం చేశాం’’అంటూ లేఖను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment