వెతకబోయిన కత్తి చేతికి దొరికి..!

Manoharachary Stolen Knife From Coconut Shop Erragadda - Sakshi

మద్యం మత్తులో కత్తిని అపహరించిన మనోహరాచారి 

దాంతోనే ఎర్రగడ్డలో మాధవి, సందీప్‌లపై దాడి 

నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు సన్నాహాలు 

సాక్షి, సిటీబ్యూరో: ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో పాటు తనను నిర్లక్ష్యం చేస్తోందనే కక్షతో కన్న కూతురి పైనే కత్తి కట్టిన మనోహరాచారి ఆమెపై దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని చోరీ చేసి తీసుకువచ్చాడు. ఈ కేసుకు సంబంధించి కీలకాధారాలైన సీసీ కెమెరా ఫుటేజ్‌లను ఎస్సార్‌నగర్‌ పోలీసులు సేకరించారు. ఎర్రగడ్డ ప్రాంతంలో గత బుధవారం తన కుమార్తె మాధవిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు మనోహరాచారిని తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. హత్యాయత్నానికి రెండు రోజుల ముందు నుంచి మనోహరాచారి ముభావంగా ఉండటంతో పాటు విపరీతంగా మద్యం తాగుతున్నాడు.

గత బుధవారం ఉదయం మాధవికి ఫోన్‌ చేసి వస్త్రాలు ఖరీదు చేసుకోవడానికి ఎర్రగడ్డకు రావాలని సూచించాడు. అనంతరం అమీర్‌పేటలోని దుకాణం నుంచి నేరుగా బైక్‌పై ఎస్సార్‌నగర్‌ వెళ్ళిన మనోహరాచారి అక్కడ ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి మద్యం తాగాడు.  మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిన అతను మాధవిని చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అక్కడి నుంచి మైత్రీ వనం వైపు వస్తూ.. మైత్రీ వైన్స్‌ పక్కన ఉన్న ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్ద ఉన్న కత్తిని తస్కరించారు. ఈ దృశ్యాలు కొబ్బరి బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో  మాధవి, సందీప్‌లపై దాడి జరిగింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top