దారుణం : 20 మంది చిన్నారులపై కత్తితో దాడి

Man Stabs 20 Children in Attack At Beijing School - Sakshi

బీజింగ్‌ : చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రైమరీ స్కూల్‌ చిన్నారులపై ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎక్కువ మంది పిల్లలకు తలపై కత్తి గాట్లు పడ్డాయని అదృష్టవశాత్తు ప్రాణనష్టం మాత్రం జరగలేదన్నారు.

 నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు ఎవరు, ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా చైనాలో ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017 జనవరిలో ఓ వ్యక్తి కూరగాయలు తరిగే కత్తితో 12 మంది చిన్నారులను తీవ్రంగా గాయపరిచాడు. ఈ కేసులో దోషికి మరణ శిక్ష పడగా.. ఇటీవల ఆ శిక్ష అమలైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top