లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు! | Man Molested Woman He Met On Dating Site After She Rejected Him | Sakshi
Sakshi News home page

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

Oct 9 2019 6:45 PM | Updated on Oct 9 2019 6:51 PM

Man Molested Woman He Met On Dating Site After She Rejected Him - Sakshi

ప్రేమకు, లావుకు, పెళ్లికి, మంచానికి సంబంధం ఏమిటంటూ కోపోద్రిక్తుడైన స్కూబర్ట్‌ ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి ఆమె చూపించిన పరుపు పైనే పడేసి..

సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లోని సెయింట్‌ నియోట్స్‌ పట్టణానికి చెందిన క్రిష్టఫర్‌ స్కూబర్ట్‌కు 44 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ‘మ్యాచ్‌ డాట్‌ కామ్‌’ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. ఓ అమ్మాయి నచ్చింది. ఇరువురు ప్రేమ సందేశాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పెళ్లయితే జంటగా పడుకునేందుకు ఓ మంచి మంచం, మెత్తటి పరువు ఉందని ఆమె చెప్పింది. అంతకన్నా పెద్ద మంచం, పెద్ద పరువు తనింట్లో ఉందని స్కూబర్ట్‌ సందేశం ఇచ్చారు. ముఖాముఖి కలుసుకునేందుకు, ప్రేమించుకునేందుకు  ఓ సాయంత్రం సంధ్య వేళ ఆ అమ్మాయి తేనీరు విందు కోసం స్కూబర్ట్‌ను రమ్మని ఇంటికి ఆహ్వానించింది.

నల్లకోటు, నల్లప్యాంట్, బ్లూ టీషర్టు ధరించి స్కూబర్ట్‌ ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ స్కూబర్ట్‌ ఆకారాన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారి షాక్‌ గురైంది. ‘మ్యాచ్‌ డాట్‌ కామ్‌’లో పెట్టిన ప్రొఫైల్‌ ఫొటోకు నాలుగింతులు ఆయన ఆకారం ఉండడమే ఆమె షాక్‌కు కారణం. ఇంటికొచ్చిన అతిథిని అవమానించ కూడదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి స్కూబర్ట్‌ను లోపలికి పిలిచి ముందు చెప్పినట్లుగా తేనేరు అందించింది. ఆయన అంత లావుగా ఉంటారని తాను ఊహించలేదని చెప్పింది. 

ఆమె తన ప్రేమ సందేశంలో పేర్కొన్న మంచం, పరుపును స్కూబర్ట్‌కు చూపిస్తూ, ఆ మంచం, పరువు తమరొక్కరికి కూడా సరిపోదని, ఇంకా తనకు ఆ మంచం మీద చోటు ఎక్కడ ఉంటుందని, మంచం మీదనైనా సరే తనకంటూ ఓ ప్రత్యేక చోటును కోరుకుంటానని తెలిపింది. మొత్తానికి స్కూబర్ట్‌ నచ్చ లేదని చెప్పింది. ఇక సెలవు తీసుకోవాల్సిందిగా కోరింది. ప్రేమకు, లావుకు, పెళ్లికి, మంచానికి సంబంధం ఏమిటంటూ కోపోద్రిక్తుడైన స్కూబర్ట్‌ ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి ఆమె చూపించిన పరుపు పైనే పడేసి రెండు, మూడు సార్లు రేప్‌ చేశారు. అప్పటికి తెల్లారడంతో స్కూబర్ట్‌ ఇంటికెళ్లి పోయారు. ఆమె పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. 

2018, జనవరి 30వ తేదీన ఈ సంఘటన జరగ్గా ఈ మరుసటి రోజే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారు ఇద్దరిని వైద్య పరీక్షలకు పంపించారు. బలవంతపు సెక్స్‌ జరిగినట్లు వైద్యులు సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. దాంతో స్కూబర్ట్‌పై పోలీసులు రెండు రేప్‌లు, ఒక లైంగిక దాడి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ 2019, అక్టోబర్‌ 8వ తేదీన (మంగళవారం) ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు ముందుకు మొదటిసారి విచారణకు వచ్చింది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరి మధ్య సెక్స్‌ జరిగిందని స్కూబర్ట్‌ న్యాయవాది వాదించారు. వైద్యుల సర్టిఫికెట్‌ ప్రకారం బలవంతపు సెక్స్‌ జరిగినట్లు తెలుస్తోందని ప్రాసిక్యూటర్‌ వార్డ్‌ జాక్సన్‌ వాదించారు. తనను బాగా రెచ్చ గొట్టడం వల్ల, తాను రెచ్చిపోవడం వల్ల బలవంతపు సెక్స్‌ ముద్రలు పడి ఉంటాయని, వాస్తవానికి పరస్పర అంగీకారంతోనే సెక్స్‌ జరిగిందని స్కూబర్ట్‌ పేర్కొన్నారు. కోర్టు తదుపరి విచారణ కోసం కేసును వాయిదా వేసింది. ఇంగ్లండ్‌ చట్టం నిబంధనలకు కట్టుబడి ఆ అమ్మాయి పేరు, వివరాలు వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement