విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం | A Man With Knife Entered Into Visakapatnam Airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

May 24 2019 4:30 PM | Updated on May 24 2019 4:54 PM

A Man With Knife Entered Into Visakapatnam Airport - Sakshi

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు

విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం రేగింది. శుక్రవారం ఓ వ్యక్తి వేట కత్తి చేతిలో పట్టుకుని ఎయిర్‌పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్‌ నుంచి ఇన్‌గేట్‌ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. ఆ వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు ఎయిర్‌పోర్ట్‌కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement