మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య | Man Killed Over Allegations Of Witchcraft | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య

Oct 12 2018 3:24 PM | Updated on Oct 12 2018 3:24 PM

Man Killed Over Allegations Of Witchcraft - Sakshi

మెస్సు సాంబయ్య మృతదేహం

ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు) : మంత్రాల నెపంతో ఓ గిరిజన వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం ఆశన్నగూడ ఎల్లాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మెస్సు సాంబయ్య(60) బుధవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. స్థానిక జామాయిల్‌ ప్లాంటేషన్‌ రోడ్డుపై దుండగులు దారి కాచి హత్య చేశారు. గురువారం ఉదయం విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున రోదించారు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై రవీందర్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

వివరాలను సేకరించి, డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంతో పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. మంత్రాల నెపంతోనే హత్య చేశారని మృతుడి కుమారుడు రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా గ్రామంలో అనారోగ్యంతో కొందరు మృతిచెందగా సాంబయ్య మంత్రాలు చేశాడని హత్యకు చేశారని భార్య పోషక్క ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement