పెళ్లి చేసుకోవాలని వివాహితకు వేధింపులు

Man Harassed Married Women For Marriage - Sakshi

బంజారాహిల్స్‌:  తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి  వెంటపడి వేధించడమే కాకుండా తాను పని చేస్తున్న షోరూంలో ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌ ముదిరాజ్‌ అనే యువకుడు 15 రోజుల నుంచి తనను మానసికంగా వేధిస్తున్నాడని పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని వివాహిత(43) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో కూడా శ్రీకాంత్‌ ముదిరాజ్‌ తనను ప్రేమ, పెళ్ళి పేరుతో వేధించగా కేసు పెట్టగా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని మళ్ళీ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top