
గుంతకల్లు: గుంతకల్లు పట్టణం పాతూరు (తాటాకులవీధి)కి చెందిన చిన్నబాబు (24) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు జారికిందపడటంతో మృతి చెందాడు. అదేరోజు అర్ధరాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు.
‘మంచి ఫిల్మ్ డైరెక్టర్‌నవుతానని వెళ్లి శవమయ్యావా చిన్నోడా’ అంటూ తండ్రి కర్ణ కన్నీరుమున్నీరుగా రోదించాడు. చిన్నకుమారుడు చిన్నబాబు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి పలువురు డైరెక్టర్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తుండేవాడు. గొప్ప డైరెక్టర్ అవుతాడని ఆశించిన తమ కలలను రైలు ప్రమాదం కబళించిందని బోరుమన్నారు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.