నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు | Man Arrest in Cheating With Fake Facebook Accounts Karnataka | Sakshi
Sakshi News home page

సినిమాల్లో వేషాలని మోసాలు

Aug 19 2019 6:43 AM | Updated on Aug 19 2019 6:43 AM

Man Arrest in Cheating With Fake Facebook Accounts Karnataka - Sakshi

కర్ణాటక, బనశంకరి: కన్నడ సినిమాల్లో నటించడానికి అవకాశం కల్పిస్తామని యువతులను పరిచయం చేసుకుని నమ్మించి డబ్బు తీసుకుని వంచనకు పాల్పడుతున్న మోసగాన్ని ఆదివారం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుంకదకట్టె హొయ్సళనగర వెంకటేశ్‌ భావసా (22) అనే యువకుడు ఈ మోసగాడు. కన్నడ సినిమా నటుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు తెరిచి యువతులను పరిచయం చేసుకుని వారితో చాటింగ్‌ చేసేవాడు. యువతులకు సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని తన సహాయకుడు వెంకీరావ్‌ను సంప్రదించాలని వాట్సాప్‌ నెంబర్‌ ఇచ్చేవాడు. అతడే వెంకీరావ్‌ పేరుతో వాట్సాప్‌ ద్వారా పరిచయస్తులతో చాటింగ్‌ చేసి సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.25 వేల చొప్పున తీసుకుని ముఖం చాటేశాడు. వీడియోకాల్‌ చేయడానికి ఓ యువతి ప్రయత్నించగా కాల్‌ రీసివ్‌ చేసుకుని కాల్‌ కట్‌ చేసి తప్పించుకున్నాడు. 

ఫిర్యాదుతో అరెస్టు   
తన పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని ఓ నటుడు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేసుకున్న పోలీసులు  ఆదివారం వెంకటేశ్‌ భావసాను అరెస్ట్‌ చేశారు. సోషల్‌మీడియా వినియోగదారులు ప్రముఖుల పేరుతో వచ్చే కాల్స్, అకౌంట్ల పట్ల  జాగ్రత్తగా ఉండాలని అదనపు పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement