ప్రేమికులను విడదీయకండి.. సెల్ఫీ వీడియోలో జంట

Lovers Committed Suicide in Chittoor After Taking Selfie Video - Sakshi

అఘాయిత్యానికి ముందు ప్రేమజంట సెల్ఫీ వీడియో!

సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన ధనుంజయ, శ్రీకాళహస్తికి చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమపెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో మథనపడ్డారు. వాళ్లిద్దరూ కలిసి జీవించలేకపోయిన, కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొరవపల్లి సమీపంలోని రైలు కిందపడి తనువు చాలించారు. దీంతో మొరవపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఇక సెలవంటూ.. పెద్దలు తమని విడదీస్తున్నారన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. ఇకముందు ప్రేమికులను విడదీయాలనుకునే వారు ఈ వీడియోను చూసి.. ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top