ఆత్మహత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

Love Couple Commits Suicide in Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: బంధువులు వ్యతిరేకించడంతో వివాహేతర ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లా రెడ్డియూర్‌ పెరుమాల్‌ కౌండర్‌ కాలనీకి చెందిన శంకర లింగమ్‌ కుమారుడు గోపినాథ్‌ (31) అదే ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (33)తో ఈ నెల 19న విల్లుపురం జిల్లా త్యాగదురుగమ్‌కి వచ్చాడు.

భార్యాభర్తలమని చెప్పి అన్నానగర్‌లో ఓ ఇల్లు బాడుగకి తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం గోపినాథ్, రాజేశ్వరి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. మరోవైపు పల్లపట్టి పోలీసు స్టేషన్‌లో గోపినాథ్‌ కనబడడంలేదని అతని భార్య ఉమా, రాజేశ్వరి కనబడడం లేదని అళగపురం పోలీసు స్టేషన్‌లో ఆమె భర్త ముల్‌లై వేందన్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీరు వివాహేతర ప్రేమ జంట అని తెలిసింది. 5 నెలల క్రితం వీరికి పరిచయం ఏర్పడి అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఇరు కుటుంబీకులు వీరి ప్రేమకి వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇంటి నుంచి బయటకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top