గుండెపోటుతో లారీ డ్రైవర్‌ మృతి

Lorry Driver Died With Heart Stroke - Sakshi

త్రుటిలో తప్పిన ప్రమాదం

చెన్నై వెళ్తూ టీ కోసం ఆగిన వైనం

అక్కడే కుప్పకూలిన డ్రైవర్‌

వరదయ్యపాళెం: గుండెపోటుతో లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిన్న పాండూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన హనుమంతు (35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం వెదురుకర్రల లోడుతో గిద్దలూరు నుంచి తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న పాండూరు వద్ద ఉదయం 6 గంటల ప్రాంతంలో టీ తాటేందుకు లారీని రోడ్డు పక్కన ఆపాడు. టీ దుకాణంలోకి వెళ్లిన హనుమంతు టీ తాగి తిరిగి లారీ వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని సమీపంలోని చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో క్లీనర్, వెదురుకర్రల యజమాని గిద్దలూరుకు తరలించారు. గిద్దలూరు టౌన్‌కు చెందిన హనుమంతుకు ఏడాది క్రితం పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతని తెలిసింది. వాహనం ఆగిన తర్వాత గుండెపోటు రావడం పెనుప్రమాదం తప్పిందంటూ స్థానికులు చర్చించుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top