విద్యుదాఘాతంతో యువతి మృతి | lady died with current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువతి మృతి

Jan 20 2018 8:44 PM | Updated on Jan 20 2018 8:44 PM

సాక్షి, రాజంపేట: విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ పంచాయతీ పరిధిలోని శేర్‌శంకర్‌ తండాలో శనివారం జరిగింది. దీప్ల, ఆజల కుమార్తె రేణుక(19) స్నానం చేసేందుకు బాత్‌రూంలోకి వెళ్లింది. ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు పక్కనే ఉన్న విద్యుత్‌ మెయిన్‌ వైరు తగలడంతో ఇంటికి కరెంట్‌ ప్రసారం జరుగుతోంది. ఇది గమనించని రేణుక బాత్‌రూంలో ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా వారికి కూడా షాక్‌ కొట్టింది. దాంతో పక్కింటి వారు పరుగున వచ్చి కట్టెతో కొట్టి విడిపించారు. రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement