సాక్షి, అన్నమయ్య: రాబందువులుగా మారిన కూటమి పార్టీల నేతలు.. ప్రజలను పీక్కుతిన్నంత పని చేస్తున్నారు. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్‌లోనూ తెలుగుదేశం తమ్ముళ్లు ప్రదర్శించిన చేతివాటం బాధితుడి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. ఓ బాధితుడికి మంజూరైన సొమ్ములో సగానికి పైగా తమ అకౌంట్లో జమ చేసుకున్నాడు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్.
రాజంపేటకు చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్‌లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే..
ఇంటికొచ్చి ఫోన్ చూసిన ఎల్లయ్యకు మతిపోయింది. ఎల్లయ్య అకౌంట్‌కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీడీపీ నేత వేణుగోపాల్ అకౌంట్‌కేనని తెలిసి నిలదీశాడు ఎల్లయ్య. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు.


