సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు పార్టీ కీలక భేటీ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ఏపీలో వైఎస్సార్‌సీపీ కేడర్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైఎస్ జగన్ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్‌తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు. తాజాగా.. బుధవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిగూడెం కేడర్‌తో భేటీ జరగనుంది.
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ భేటీకి హాజరుకానున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపైనా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది.


