సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన రోత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం, ఏప్రిల్ 8) కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. మహిళలను ఉద్దేశించి పైశాచిక కామెంట్స్ చేసిన రాధాకృష్ణ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తోంది.
వైఎస్సార్‌సీపీ ఆందోళనలు.. అప్‌డేట్స్
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
- అనంతపురం ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్ద ఉద్రిక్తత
- నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం
- అక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి: దేవినేని అవినాష్
- రోత పత్రిక, రోత ఛానెల్ ఏబీఎన్‌లో రాధాకృష్ణ మహిళలను కించ పరిచాడు
- రాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
- అమరావతిలో అవినీతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు
- రాధాకృష్ణ దుర్భాషలాడితే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏమైపోయారు
- స్కీమ్‌లు, స్కామ్‌లతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు
- ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మావిగన్‌ను జగన్ ప్రతిపాదించారు
గుంటూరులో పోలీసుల దౌర్జన్యం
- ఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతల నిరసన
- మాజీ మంత్రి అంబటిని అడ్డుకున్న పోలీసులు
- ఏబీఎన్ ఆఫీస్ ఎదుట బైఠాయించిన అంబటి, పార్టీ నేతలు
- వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్
- శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై జులుం
- పోలీసుల అరాచకంపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

- నెల్లూరు ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన


- మాజీ మంత్రి కాకాణి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన
- వైసీపీ నేతల ఇంట్లోని మహిళలపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ
- ABN రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆగ్రహంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకు

- రాధాకృష్ణపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్
- రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
- రాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టాము
- రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకు
- దేశంలో అతిపెద్ద స్కాం అమరావతి
- మావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్
- జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్
రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు..: కేకే రాజు

- రాధాకృష్ణపై విశాఖ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం
- మావిగన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
- దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు
- రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ట కు చేరుకుంది
- జర్నలిజం విలువలను రాధాకృష్ణ కాలరాశారు
- కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు
- రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి
ట్రాఫిక్‌ను మళ్లించి మరీ పోలీసుల రక్షణ

వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
ఏబీఎన్ ఆఫీసు వద్ద ఆందోళన చేసేందుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తల అరెస్ట్
ఏబీఎన్ కార్యాలయానికి మూడంచెల భద్రత
ఇప్పటికే ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ఆంధ్రజ్యోతి కోసం ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు
పాఠశాలలకు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులు
నగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు
పాత బస్టాండ్‌కు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులు
శాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులు
- రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసన
- నిరసనలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, ఉమ్మడిగి శాఖ జిల్లా నాయకులు
- వైఎస్సార్‌సీపీ నిరసనపై పోలీసుల జులుం
- నిరసన కోసం వేసిన టెంటును తీసివేసిన పోలీసులు
- శాంతియుత ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు
- ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
- ఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులను, అనకాపల్లి జిల్లా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
- పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
- ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్
భారీగా మోహరించిన పోలీసులు
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆందోళన
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ ఆధ్వర్యంలో నిరసన
అంబేద్కర్ విగ్రహ వద్దకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
భారీగా మోహరించిన పోలీసులు
- ఆంజాద్ బాషా హౌజ్ అరెస్ట్

- వైఎస్సార్‌సీపీ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు
- వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకుల హౌస్ అరెస్టులు
- మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
- అంజాద్ బాషా ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్
- నేడు కడపలోని ABN కార్యాలయం ఎదుట నిరసనకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- ఈ నిరసనలకు హాజరు కావద్దంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం
విజయవాడ ఏబీఎన్ ఆఫీస్ వద్ద..
- ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ఏబీఎన్ కార్యాలయం వద్ద ఆందోళనకి సిద్దమైన వైఎస్సార్సీపీ
- ఏబీఎన్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు..
- ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లే రహదారులలో బారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు
- నిరసన తెలిపి తీరతామంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు
మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ, విలువలు దిగజార్చేలా ఉన్నాయని చెప్పారు. మహిళలను ఆయన అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆఫీసు ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నేడు ఏపీలోనూ శాంతియుత నిరసనలు తెలపనున్నారు.


