‘ ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్‌కు పంపాలి’ | Row At Rajahmundry Police Station, YSRCP Leaders Demands Apparao Audio Be Sent To National Forensic Lab, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘ ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్‌కు పంపాలి’

Mar 28 2026 3:29 PM | Updated on Mar 28 2026 7:11 PM

YSRCP Demands Apparaos Audio Be Sent to National Forensic Lab

రాజమహేంద్రవరం: దళితుల గురించి దళిత సంఘాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి  ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్‌ఫైల్‌ ఇవ్వడానికి సీఐ బాజీలాల్‌ నిరాకరించారు. దాంతో వైఎస్సార్‌సీపీ నేతలు, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఐ తీరును మాజీ ఎంపీ భరత్‌ నిలదీశారు. 

దీనిలో భాగంగా మీడియాతో భరత్‌ మాట్లాడుతూ.. ‘ దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆడియోలో ఆదిరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ జరగాలని డిమాండ్ చేశాం. ఆడియోలో అప్పారావు ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. 

ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్‌కు పంపాలి. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలి. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గంటసేపు వాగ్వాదం చేస్తే అకనాలెడ్జిమెంట్ కాఫీఇచ్చారు’ అని స్పష్టం చేశారు.

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

Advertisement
 
Advertisement
Advertisement