రూ. 200 కోట్లు మోసం చేసిన ట్రావెల్‌ ఏజెన్సీ

KSS Travel Agency Fraud in the Name of Umrah Tickets - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్‌ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడింది. దీంతో ట్రావెల్‌ ఏజెన్సీ ఎదుట ముస్లింలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తక్కువ టికెట్‌ ధరతో కడప ఆల్మాస్‌ పేటలో కేఎస్‌ఎస్‌ ఉమ్రా ట్రావెల్‌ ఏజెన్సీ ఒక్కొక్కరి దగ్గర రూ. 30 వేల వరకూ వసూలు చేసింది. డబ్బులు చెల్లినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదనే అనుమానంతో బాధితులు ఆరాదీశారు. వసూలు చేసిన సొమ్ముతో వారు ఉండాయించారనే సమాచారంతో బాధితులు ట్రావెల్‌ ఏజెన్సీ ఎదుట సోమవారం ఆదోళన చేపట్టారు. 

జిల్లాలోని ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లి తదితర ప్రాంతాల వారు ఇందులో మోసపొయ్యారు. బాధితులు ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రొద్దుటూరు పోలీసులు ఏజెన్సీ నిర్వాహకుడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అలీతో పాటు మరో ముగ్గురిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ట్రావెల్‌ ఏజెన్సీ రూ. 200 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top