మందెరకలపాడులో బాంబుల మోత

Khammam Police Bomb Blasts in Kinnerasani Reservoir - Sakshi

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని అభయారణ్యంలో మందెరకలపాడు అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా బాంబుల మోత మోగింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నక్సల్స్‌ మధ్య ఎదురు కాల్పులు జరిగాయా? ల్యాండ్‌ మైన్స్‌ పేల్చారా? అనే చర్చ సాగింది. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... గతంలో తోగ్గూడెం క్వారీలో పోలీసులు జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేయాలని ఆదేశించడంతో కొత్తగూడెం నుంచి బాంబు స్క్వాడ్‌ వచ్చి మందెరకలపాడు అటవీప్రాంతంలో నీటిలో జిలెటిన్‌స్టిక్స్‌ను నిర్వీర్యం చేశారు. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. మరికొన్ని జిలెటిన్‌ స్టిక్స్‌ను నేడు నిర్వీర్యం చేయనున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జిలెటిన్‌ స్టిక్స్‌ను వాగులో పేల్చామని పాల్వంచ రూరల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top