కోర్టుకు హాజరుకానున్న ప్రదీప్‌

Jan 22 Anchor Pradeep to attend court  - Sakshi

హైదరాబాద్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ ఈ నెల 22న కోర్టుకు హాజరు కానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ అధికారులకు ఆయన సమాచారం అందించారు. గత నెల 31న అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అనంతరం ఈ నెల 16న కోర్టుకు హాజరవుతానని ఇటీవల పోలీసులకు సమాచారం ఇచ్చారు. 16న కోర్టుకు సెలవు కావడంతో మళ్లీ 22కి ఆయన హాజరు వాయిదా పడింది. నాంపల్లిలోని నాలుగో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రదీప్‌ను పోలీసులు హాజరు పరచనున్నారు. అదేరోజు ఆయనకు శిక్ష ఖరారు కానుంది. 

Back to Top