ఆత్మహత్య : నోట్‌బుక్‌లో కీలక అంశాలు

I Am Failure : Schoolgirl Who Complained Of Sex Abuse - Sakshi

నోయిడా : తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆమె ఇంట్లోని టేబుల్‌ డెస్క్‌లో నుంచి ఓ నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో.. 'నేను ఫెయిల్యూర్‌' అంటూ రెండుసార్లు, 'ఐయామ్‌ డంబ్‌' అంటూ ఓసారి రాసి పెట్టింది. ఆ చేతి వ్రాత చనిపోయిన విద్యార్థినిదే అని పోలీసులు గుర్తించారు. నోయిడాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్కూలులో సోషల్‌, సైన్స్‌ టీచర్లు తమ కూతురును వేధించారని, అకారణంగా, ఉద్దేశ పూర్వకంగా ఫెయిల్‌ చేశారని, ఆ అవమానాలతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆమె నోట్‌బుక్‌లో కీలక విషయాలు కనిపించాయి. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేందుకు సాక్ష్యంగా ఆ నోట్‌బుక్‌లోని విషయాలు సహకరిస్తాయని పోలీసులు చెబుతున్నారు. 'సైన్స్‌, సోషల్‌ టీచర్లు తనను అసభ్యంగా తాకుతున్నారని, నా కూతురు నాకు చెప్పింది. అయితే, నేను కూడా ఓ టీచర్‌నే అవడంతో ఉపాధ్యాయులు అలా చేయలేరని చెప్పాను. అలా నేను చెప్పడమే పొరపాటైంది. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే బాగుండేది. నా కూతురు ఎంత బాగా పరీక్ష రాసినా వారు నిజంగానే ఫెయిల్‌ చేశారు' అంటూ విద్యార్థిని తండ్రి చెప్పాడు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు స్కూల్‌ యాజమాన్యం కొట్టిపారేసింది. ఆ విద్యార్థిని కోసం మరోసారి పరీక్ష కూడా పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top