
పెనమలూరు : భర్త ఓ దుకాణంలో సెల్‌ఫోన్ చోరీ చేయగా, ఈ విషయం తెలుసుకుని భార్య దుకాణం యజమానురాలికి సమాచారం ఇచ్చి తిరిగి ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానూరు మురళీనగర్‌కు చెందిన కె.రామకృష్ణ కొద్ది రోజుల కిందట విజయవాడ గాంధీనగర్ వెళ్లాడు. అక్కడ జనరల్ స్టోర్‌లో వస్తువులు కొన్న సమయంలో దుకాణం యజమానురాలు చెక్కా దుర్గాభవానీ సెల్‌ఫోన్ చోరీ చేశాడు. రామకృష్ణ భార్య శ్యామలాగౌరీకి అనుమానం వచ్చి భర్తను నిలదీసింది.
సరైన సమాధానం చెప్పక పోవటంతో ఫోన్‌లో ఉన్న ఓ నంబన్‌కు ఫోన్ చేయగా దుర్గాభవానీ లైన్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ తనదేనని ఇటీవల చోరీ జరిగిందని తెలిపింది. శ్యామల ఫోన్‌ను పోలీసులకు అప్పగించంది. సీఐ దామోదర్ ఫోన్ యజమానురాలికి అందచేశారు.