అనుమానంతో ఆయుష్షు తీశాడు | Husband Killed Wife In Mangalagiri Guntur | Sakshi
Sakshi News home page

అనుమానంతో ఆయుష్షు తీశాడు

Jun 4 2018 1:09 PM | Updated on Aug 24 2018 2:36 PM

Husband Killed Wife In Mangalagiri Guntur - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

మంగళగిరిరూరల్‌:  తాగిన మైకంలో ఓ భర్త రోకలితో మోది భార్యను హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామానికి  చెందిన శృంగారపాటి రమేష్‌ కొంతకాలం క్రితం ఆత్మకూరు గ్రామం వైఎస్సార్‌కాలనీలో తన భార్య మేరీ (37), ఇద్దరు పిల్లలతో కలిసి స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనా మందిరంలో ఉన్న మేరీని ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం బయట భోజనం చేస్తున్న మేరీని వెనుక నుంచి రోకలిబండతో బాదడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రమేష్‌ అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మేరీని అనుమానంతో వేధించేవాడని, పదేపదే డబ్బులు తెమ్మంటూ హింసించేవాడని మృతురాలి బంధువులు పోలీసులకు వివరించారు. అతనికి మద్యం సేవించే అలవాటుందని, జూదం అలవాటు కూడా ఉందని స్థానికులు తెలిపారు. భార్యను అనుమానించేవాడని వివరించారు.
 మేరీ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది. భర్త పనిచేసినా చేయకపోయినా స్కూల్లో ఆయాగా పనిచేస్తూ, అల్యూమినియం పాత్రలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోందని స్థానికులు వివరించారు.

రమేష్‌కు దేహశుద్ధి చేసిన మహిళలు, స్థానికులు
శృంగారపాటి రమేష్‌ భార్యను కొట్టి చంపిన తర్వాత పారిపోయి సమీపంలో ఇప్పటం రోడ్డులోని పొదల్లో దాక్కొన్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు, పలువురు మహిళలు అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement