భర్త వివాహేతర సంబంధం.. భార్య న్యాయపోరాటం

Husband Harassment Case In Adilabad - Sakshi

మంచిర్యాలక్రైం: కట్టుకున్న భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కొత్త కాపురం పెట్టడంతో పెళ్లి భార్య భర్త ఇంటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. కోడలుకు అండగా నిలవాల్సిన అత్తామామ ఆడబిడ్డ ఇంట్లో నుంచి గెంటేసి ఇంటికి తాళం వేసి పారిపోయిన ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పాత మంచిర్యాలకు చెందిన ఎడ్ల వాణికి తమ మేనబావ అయిన గురిజాల రాజమల్లుతో 2009 నవంబర్‌ 13న పెళ్లయింది. పెళ్లికి ముందే వాణి తండ్రి సింగరేణి ఉద్యోగాన్ని రాజమల్లుకు పెట్టించి ఒప్పందం ప్రకారం వివాహం చేశారు.

కాని కొంతకాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని, అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వాణి గత జూలై 16న స్థానిక మహిళ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా అత్త రాధాదేవి, మామ రాజలింగు, ఆడపడుచు ఆరుణ వేధింపులు అధికమయ్యాయి. నెల క్రితం వాణి భర్త రాజమల్లు మరో యువతితో పారిపోయి వివాహం చేసుకొని గుర్తుతెలియని ప్రదేశంలో వేరే కాపురం పెట్టాడని భార్య ఆరోపిస్తోంది. న్యాయం కోసం ఆందోళనకు దిగగా వాణికి స్థానికులు అండగా నిలిచారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top