అర్ధరాత్రి హిజ్రాల హల్‌ చల్‌

Hijras Attack on Two Men And Car in Hyderabad - Sakshi

డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు వ్యక్తులపై దాడి

కారు ధ్వంసం నగదు, నగలు మాయం

పోలీస్‌ స్టేషన్‌లోనూ వీరంగం

ఉప్పల్‌: ఉప్పల్‌ చౌరాస్తాలో హిజ్రాలు హాల్‌ చేశారు. డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి చితకబాదిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం  అర్థరాత్రి చోటు చేసుకుంది. ఉప్పల్‌ పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తార్నాక, నాగార్జున నగర్‌కు చెందిన ప్రదీప్‌రెడ్డి మంగళవారం  రాత్రి కారులో తన స్నేహితులు రామిరెడ్డి, రాంచంద్రారెడ్డితో కలిసి నాగోల్‌లోని ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు.

ఉప్పల్‌ బస్‌స్టాప్‌లో  స్నేహితుడు రాంచంద్రారెడ్డిని దింపేందుకు కారును ఆపాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా స్కూటీపై వచ్చిన ఇద్దరు హిజ్రాలు  వారిని డబ్బులు డిమాండ్‌ చేయడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన హిజ్రాలు  ప్రదీప్‌రెడ్డి, రాంచంద్రారెడ్డిపై దాడి చేశారు. బాధితులు 100 కు డైల్‌ చేయడంతో పోలీసులకు చెబుతారా అంటూ తమ స్నేహితులను ఫోన్‌ చేయడంతో అక్కడికి వచ్చిన మరో నలుగురు హిజ్రాలు మరోసారి వారిపై దాడి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం
పోలీస్‌ స్టేషన్‌లోనూ వారు తన ప్రతాపాన్ని చూపారు. స్టేషన్‌లోని  పూల కుండీలను ధ్వసం చేశారు. ఆడ్డు వచ్చిన వారిని తిడుతూ హల్‌ చల్‌ చేశారు. దరఖాస్తు రాస్తున్న  ప్రదీప్‌పై మరోసారి దాడికి  యత్నించడంతో అడ్డుకున్న హోం గార్డు లాలా నాయక్‌ను పక్కకు తోసేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి  రిమాండ్‌కు తరలించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top