
జీఎస్టీ పరధిలోకి రాని వస్తువులపై కూడా జీఎస్టీ విధిస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్న మాల్స్, హోటల్స్‌పై అధికారులు కొరడా ఘులిపిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ పరధిలోకి రాని వస్తువులపై కూడా జీఎస్టీ విధిస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్న మాల్స్, హోటల్స్‌పై అధికారులు కొరడా ఘులిపిస్తున్నారు. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం పరిధిలోని పలు మాల్స్, హోటల్స్, బేకరీలలో శుక్రవారం తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
జీఎస్టీ నెంబర్ లేకున్నా జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న పలు దుకాణాలు, మాల్స్‌లపై కేసులు నమోదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తైన అనంతరం కేసుల వివరాలు తెలియజేస్తామనన్నారు.