మంచినీళ‍్లడిగి... బాలికపై లైంగిక దాడి | girl raped in khammam district | Sakshi
Sakshi News home page

మంచినీళ‍్లడిగి... బాలికపై లైంగిక దాడి

Jan 4 2018 6:32 PM | Updated on Aug 21 2018 5:54 PM

సాక్షి, అశ్వారావుపేట రూరల్ : ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఏఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..అశ్వారావుపేట రూరల్‌ మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన బాలిక(15) తన చెల్లితో కలిసి ఈ నెల 2వ తేదిన ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో దమ్మపేట మండలానికి చెందిన పిక్కిలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చి మంచినీళ్లు అడిగాడు. దాంతో బాధితురాలి చెల్లి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చే సరికి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా అడ్డుకుంది. అడ్డుకుంటున్న చెల్లిపై దాడికి పాల్పడి బయటకు నెట్టివేశాడు.

అనంతరం ఇంటి తలుపులు మూసి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం సమయంలో ఇంటికి రాగా, బాధితురాలు సంఘటనను చెప్పింది. దాంతో గురువారం ఉదయం లైంగిక దాడి సంఘటనపై తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఏఎస్‌ఐ శంకర్‌రావు కేసు నమోదు చేశారు. దీనిపై అశ్వారావుపేట సీఐ అబ్బయ్య దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన‍్న నిందితుని కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement