మా భూములు లాక్కుంటున్నారు

Forest Authorities Lands Taking Under Their Control From Tribals - Sakshi

సాక్షి,కాసిపేట: అన్యాయంగా 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ శాఖ అధికారులు కేసులు పె డుతూ లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ నాయకపుగూడ శివారులోని భూములు ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కాని ఈ మ ధ్య కాలం నుంచి అటవీశాఖ అధికారులు తమ భూములు అంటూ సాగు చేసుకుంటున్న గిరిజనులను బెదిరించి కేసులు పెడుతున్నారు. వారం రోజుల క్రితం సాగు చేసుకునేందుకు వెళ్లిన రైతుపై, ట్రాక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు.

1978లో 116 మందికి 188 ఎకరాలు ప్రభుత్వం అసైన్డ్‌ చేసింది. లావణి పట్టాలు కలిగి ఉన్న రైతులు కొంత మంది సాగు చేసుకోగా కొంత మంది పడావుగా వదిలేశారు. ఈ మధ్య కాలంలో సాగు చేసుకునేందుకు గిరిజనులు మా భూములు అంటూ వెళ్తుండగా బెల్లంపల్లి డివిజన్‌ అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం అక్రమ కేసులు పెట్టడంతో సర్పంచ్‌ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు సిద్ధమవుతూ అధికారులను కలిసి విన్నవించారు. దీనిపై రెవెన్యూ అధికారులు తమ భూములని లావణి పట్టాలు ఉన్నాయని చెబుతుండగా, అటవీశాఖ అధికారులు తమ భూములని అంటున్నారు. దీంతో ఇరుశాఖల మధ్య సమన్వయం లోపించడం గిరిజనులకు శాపంగా మారింది. కనీసం రెండేళ్ల నుంచి ఏం తేల్చకుండా రైతులను వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పట్టాలు ఉన్న భూములను తమకు ఇప్పించాలని లేనట్లయితే మరోచోట భూమి చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.    

గిరిజనులను వేధించడం సరికాదు..
ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసు కుంటున్న గిరిజన రైతులను అటవీశా ఖ అధికారులు ఇబ్బందులకు గురి చే యడం సరికాదు. దీనిపై ఇరు శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమ స్యను పరిష్కరించాలి. లేదంటే ఆందో ళనలు ఉధృతం చేస్తాం.   

వేముల కృష్ణ పెద్దనపల్లి

యాబై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. 
ప్రభుత్వం 1978లో తమకు భూములు అసైన్డ్‌ చేయడంతో అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వచ్చి తమ భూములంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి.  

  – మెసయ్య, రైతు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top