నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం; కోట్లలో ఆస్తి నష్టం

Fire Accident In Nellore Chinna Bazar - Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నబజారు ప్రాంతంలోని శ్రీ కనకదుర్గా మెటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ గల ప్లాస్టిక్‌ సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని ఖాళీ చేయిస్తూ..రాత్రి నుంచి మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, కలెక్టర్‌ శేషగిరి బాబు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top